మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్టు | TDP candidate arrested for selling alcohol hero | Sakshi
Sakshi News home page

మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్టు

Mar 28 2014 1:53 AM | Updated on Aug 11 2018 4:24 PM

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థితో పా టు నల్లబెల్లం వ్యాపారిని పోలీసులు గురువా రం అరెస్టు చేశారు.

చింతపల్లి, న్యూస్‌లైన్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థితో పా టు నల్లబెల్లం వ్యాపారిని పోలీసులు గురువా రం అరెస్టు చేశారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, సారా తయారీకి వినియోగించే బెల్లా న్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ ప్రసాద్ తెలిపారు.  చింతపల్లి మండలం తాజంగికి చెందిన రుబ్బా సంజీవరావు కొద్దిరోజులుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

ఎస్‌ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో సంజీవరావు ఇంటిని సోదా చేయగా సుమారు రూ.20వేల విలువైన 158 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. సంజీవరావు తాజంగి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లోతుగెడ్డ జంక్షన్‌కు చెందిన షేక్ అక్బరుద్దీన్ కిరాణా దుకాణంలో తనిఖీలు చేయగా రూ.5,800 విలువైన 250 కిలోల బెల్లం దొరికిందని, వారిద్దరిని అరెస్టు చేశామని సీఐ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement