టీడీపీ దౌర్జన్యాలను అరికట్టాలి | TDP assault preventing | Sakshi
Sakshi News home page

టీడీపీ దౌర్జన్యాలను అరికట్టాలి

Oct 3 2014 3:32 AM | Updated on Aug 10 2018 8:35 PM

పులివెందులలోని నగరిగుట్ట గిరిజనులపై మంగళవారం టీడీపీ కార్యకర్తలు సుమారు 200మంది రాళ్లు, సీసాలు, కర్రలతో విచక్షణారహితంగా గంటపాటు దాడి చేసి మూడు రోజులవుతున్నా అరెస్ట్ చేయకపోవడంపై నిరసన ర్యాలీ చేపట్టారు.

నల్లబ్యాడ్జీలతో వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డిల నిరసన ర్యాలీ
పులివెందుల/అర్బన్ : పులివెందులలోని నగరిగుట్ట గిరిజనులపై మంగళవారం టీడీపీ కార్యకర్తలు సుమారు 200మంది రాళ్లు, సీసాలు, కర్రలతో విచక్షణారహితంగా గంటపాటు దాడి చేసి మూడు రోజులవుతున్నా అరెస్ట్ చేయకపోవడంపై నిరసన ర్యాలీ చేపట్టారు.  పులివెందులలోని వెంకటేశ్వర ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

కొత్త బస్టాండు సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ వైఎస్సాఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి పాత బస్టాండు మీదుగా పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకొని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా ముద్దనూరు రోడ్డులోని పాత జూనియర్ కళాశాల వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ర్యాలీ ముగించారు.
 
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ర్యాలీ అనంతరం పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వైఎస్‌ఆర్ సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డీఎస్పీ హరినాథబాబు, సీఐ భాస్కర్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను టీడీపీ నాయకులు భయాందోళనకు గురిచేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తే గిరిజనులపై కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజనులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement