
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో ఓ కార్యకర్త మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం గిద్దలూరులో జరిగింది. పట్టణంలోని ఆదర్శ బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తల కోసం ముండ్లపాడు సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఉన్న షెడ్డు వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. మండలంలోని కొంగళవీడుకు చెందిన టీడీపీ కార్యకర్త, వ్యవసాయ కూలీ భూపని రామయ్య (50) భోజనం తినేందుకు వచ్చాడు. భోజనం తింటూ కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు.