విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఓ వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
తణుకు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఓ వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దిగమర్తి రామచంద్రరావు ఉద్యోగాల పేరుతో 29 మంది నిరుద్యోగుల నుంచి దాదాపు 25 లక్షల రూపాయలు వసూలు చేశాడు.
ఎంతకాలమైన ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాడు.