బెజవాడలో మిల్కీ బ్యూటీ తమన్నా | tamanna attend celkon company programme in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో మిల్కీ బ్యూటీ తమన్నా

Nov 14 2014 12:57 AM | Updated on Sep 2 2017 4:24 PM

బెజవాడలో మిల్కీ బ్యూటీ తమన్నా

బెజవాడలో మిల్కీ బ్యూటీ తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా గురువారం విజయవాడలో సందడి చేశారు.

మిల్కీ బ్యూటీ తమన్నా గురువారం విజయవాడలో సందడి చేశారు. సెల్‌కాన్ మొబైల్ కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభిమానులను అలరించారు.సెల్‌కాన్ మొబైల్ సంస్థ కొత్తగా తయారుచేసిన క్యూ42 మొబైల్‌ను హోటల్ తాజ్ గేట్‌వే గురువారం ఆమె మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్‌లోని సెల్ఫీ ఫ్రంట్ కెమెరా అంటే తనకె ంతో ఇష్టమన్నారు.

ఈ మొబైల్‌ను మొదటిగా తానే కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తాను ‘బాహుబలి’లో నటిస్తున్నానని, ఈ అవకాశం రావడం తన అదృష్టమన్నారు. జీనియస్ డెరైక్టర్ అంటూ రాజమౌళికి కితాబు ఇచ్చారు. తెలుగులో రవితేజాతో, తమిళంలో ఆర్యతో సినిమా చేస్తున్నానని తమన్నా చెప్పారు. తెలుగు బ్రాండ్ మొబైల్స్‌ను అందిస్తున్న సెల్‌కాన్ ఫోన్లను కొనుగోలు చేయూలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సెల్‌కాన్ మొబైల్స్ ఎండీ వై.గురు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రేతినేని మురళి తదితరులు పాల్గొన్నారు.

- విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement