టి– 20 జిల్లా జట్టు ఇదే! | T20 Senior Senior cricket team selected | Sakshi
Sakshi News home page

టి– 20 జిల్లా జట్టు ఇదే!

Dec 4 2017 10:56 AM | Updated on Dec 4 2017 10:56 AM

T20 Senior Senior cricket team selected - Sakshi

ఒంగోలు: స్థానిక శర్మా కాలేజి గ్రౌండులో టి–20 సీనియర్‌ జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక ఆదివారం జరిగింది. మొత్తం 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 15 మందిని తుది జట్టుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారు ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏలూరులో జరిగే టి–20 సెంట్రల్‌ జోన్‌ క్రికెట్‌ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చింతపల్లి ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. ఎంపిక కోచ్‌ సుధాకర్‌ నేతృత్వంలో జరిగింది. 

సభ్యులు..
టి.వంశీకృష్ణ, సి.హెచ్‌.క్రాంతికుమార్, కె.క్రాంతికిరణ్, డి.తుమ్మల్, సి.హెచ్‌.సురేంద్ర, వి.వేణు, ఎ.వినయ్‌కుమార్, షేక్‌ అబ్దుల్లా, ఆర్‌.అచ్యుత్, పి.రవీంద్ర, బి.శివారెడ్డి, పి.వి పవన్‌కుమార్, టి.వి.ఎ.ఎం ప్రసాద్, కె.రాధేశ్యాం, జి.సాయికుమార్‌.  జట్టుకు కోచ్‌/మేనేజర్‌గా కె.సుధాకర్‌ వ్యవహరిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement