ప్రాణం తీసిన స్వైన్‌ఫ్లూ | swine flu death in prakasham | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన స్వైన్‌ఫ్లూ

Jan 10 2015 7:12 PM | Updated on Sep 2 2017 7:30 PM

ప్రకాశం జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

ప్రకాశం జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పంగులూరు మండలం జాగర్లమూడివారి పాలెం గ్రామానికి చెందిన శివకృష్ణ స్వైన్‌ఫ్లూ రక్కసి దెబ్బకు నేలకొరిగాడు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో..... చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.

 

ఎంతో ఆరోగ్యంగా ఉండే శివకృష్ణ నెలరోజుల కిందట.... హైదరాబాద్‌ వెళ్లి వచ్చాడు. తర్వాత రోజే జ్వరంతో మూలన పడ్డాడు. వెంటనే  కుటుంబసభ్యులు అతన్ని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  వైద్యులకేమీ అంతుపట్టకపోవడంతో.... హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించారు. అప్పటి నుంచి అక్కడే ఉండే చికిత్స పొందుతుండగా....శనివారం పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే కానరానిలోకాలకు వెళ్లడంతో...కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement