మార్చిలో సునిల్‌తో సినిమా చేస్తా | Suresh Kondeti's film with Sunil | Sakshi
Sakshi News home page

మార్చిలో సునిల్‌తో సినిమా చేస్తా

Jan 14 2014 2:58 AM | Updated on Jul 6 2018 3:32 PM

మార్చిలో సునిల్‌తో సినిమా చేస్తా - Sakshi

మార్చిలో సునిల్‌తో సినిమా చేస్తా

నూతన సంవత్సరంలో వరుస సినిమాల నిర్మాణంతోపాటు ప్రజా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత,

నూతన సంవత్సరంలో వరుస సినిమాల నిర్మాణంతోపాటు ప్రజా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం సినీ పత్రిక సంపాదకుడు సురేష్ కొండేటి అన్నారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా స్వస్థలమైన పోడూరు మండలం వేడంగిపాలెం వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఈ ఏడాది మార్చిలో హీరో సునిల్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు చెప్పారు. తమిళంలో విజయవంతమైన వరుతా పడార్ వాలీబార్ సంఘం చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలిపారు.
 
 ఈ చిత్రానికి దర్శకుడు, మిగిలిన నటీనటులను త్వరలో వెల్లడిస్తామన్నారు. హీరో సిద్ధార్థతో కార్తికసుబ్బరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం పూర్తయ్యిందని, ఫిబ్రవరిలో దీన్ని విడుదల చేయనున్నట్లు సురేష్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 60 చిత్రాలను పంపిణీ చేయగా తాను నిర్మించిన వివిధ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించాయన్నారు. సొంతగడ్డపై అభిమానంతో వేడంగిపాలెం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు సహకారం అందించానని, రానున్న రోజుల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సురేష్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement