భార్య తగోద్దని అభ్యంతరం చెప్పడంతో ఆమదాలవలస మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన బమ్మిడి అప్పన్న(40) శుక్రవారం ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
తాగోద్దంటే చచ్చిపోతా!
Mar 31 2017 6:17 PM | Updated on Nov 6 2018 7:53 PM
	తూర్పుగోదావరి: మద్యం తాగోదంటే చచ్చిపోతానని భార్యను భర్త రోజు భయపెడుతున్నాడు. ఈవిధంగానే భార్య తగోద్దని అభ్యంతరం చెప్పడంతో  ఆమదాలవలస మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన బమ్మిడి అప్పన్న(40)   శుక్రవారం ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
	 
					
					
					
					
						
					          			
						
				
	అతిగా మద్యం సేవిస్తూ ఆరోగ్యం పాడుచేసుకోవడంతోపాటు కూలి చేసుకుని దాచుకున్న డబ్బులు కూడా దుబారా చేస్తున్నావని భార్య నిలదీయడంతో ఉదయాన్నే గ్రామ శివారులో ఉన్న మామిడితోట వైపు వెళ్లి ఆయన ఉరి వేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా కుటుంబ కలహాలతో సుమారు ఐదు నెలలపాటు గ్రామం వదిలి వెళ్లిపోయాడని చెబుతున్నారు. మృతునిది కోటబొమ్మాళి మండలం లక్కుందిద్ది గ్రామమని, 12 సంవత్సరాల క్రితం నాగావళిని వివాహం చేసుకొని కొత్తవలసకు వచ్చి స్థిరపడ్డాడని చెబుతున్నారు. మృతునికి 11 ఏళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
