రాజంపేట సబ్‌జైలుకు కన్నం వేశారని ఆదివారం పట్టణంలో కలకలం రేగింది. దీంతో జైలు అధికారులు ఆ కన్నంను పరిశీలించారు.
రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట సబ్‌జైలుకు కన్నం వేశారని ఆదివారం పట్టణంలో కలకలం రేగింది. దీంతో జైలు అధికారులు ఆ కన్నంను పరిశీలించారు. ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని భావించారు. ఇటీవల సబ్‌జైలును కొత్తగా నిర్మించారు. ఈ జైలుకు ప్రహారీ గోడ ఆఫీసర్స్ క్లబ్‌కు సమీపంలో ఉంది. ఈ గోడ అవతలి వైపు జైలులో ఉన్న వినాయకస్వామి గుడికి వస్తుంది.
ఆ తర్వాత ఖైదీలు ఉండే గదులు, బాత్ రూములు ఉన్నాయి. ఈ గోడకు రంధ్రం ఎందుకు వేశారనే అన్న సందేహాలు వెలువడుతున్నాయి. జైలు ప్రహరీకి రంధ్రం పడిన విషయం తెలుసుకున్న జైలు సూపరిండెంట్ బీ.రవిశంకర్‌రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించారు. కన్నం కాదని, ఇది ఆకతాయిలు చేసిన పని అని వివరించారు.