ఎంగిలి చేతులతో ఎందాక...

Students Suffering Water Problems In Srikakulam District  - Sakshi

సర్కార్‌ బడుల్లో మౌలిక సదుపాయాలు లేవనడానికి ఈ చిత్రంలో వరుసగా నడిచి వెళ్తూ కనిపిస్తున్న విద్యార్థులే నిదర్శనం. పోలాకి మండలం చీడివలస ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో వీరంతా చదువుతున్నారు. ఇక్కడ ఉన్న బోరు సుమారు ఆరు నెలల క్రితం పాడవ్వడంతో విద్యార్థులకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కంచాలు, చేతులు కడుక్కోవడానికి నీరు అందుబాటులో లేదు. దీంతో చేసేది లేక పాఠశాలకు సమీపంలో రోడ్డు ఆవలవైపు ఉన్న సాగునీటికాలువ వద్దకు వెళ్లి కంచాలు కడ్డుక్కోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు.

సుమారు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. పిల్లల వెంట ఓ ఉపాధ్యాయుడు తోడుగా వెళ్లి..వస్తుండడం దినచర్యగా మారింది. బోరు పాడైన విషయాన్ని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల దృష్టికి సర్పంచ్‌ ముద్దాడ రాము తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు. విద్యార్థులకు కష్టాలు తీరలేదు.   అధికారులు స్పందించి నీటి సమస్య నుంచి తమ పిల్లలను గట్టెక్కించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.    

Back to Top