బాపట్ల అగ్రికల్చర్‌ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత | Students Strike At Bapatla Agricultural College | Sakshi
Sakshi News home page

బాపట్ల అగ్రికల్చర్‌ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Dec 19 2018 3:25 PM | Updated on Dec 19 2018 3:25 PM

Students Strike At Bapatla Agricultural College - Sakshi

ఆందోళన చేస్తున్న విద్యార్థులు

సాక్షి, గుంటూరు: జిల్లాలోని బాపట్ల అగ్రికల్చర్‌ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్ధులు ఆందోళకు దిగారు. కాలేజీ యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. వారం రోజులుగా తమ సమస్యలు పరిష్కంచాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

దీంతో తరగతులను బహిష్కరించిన విద్యార్థులు. విద్యార్థులతో యాజమాన్య చర్చలు విఫలం కావడంతో ఈ నెల 27 వరకు సెలవులు ప్రకటించిన కాలేజీ యాజమాన్యం. విద్యార్థులను  హాస్టల్‌ నుంచి  బలవంగతంగా ఖాళీ చేయిస్తున్నారు. తమ సమస్యలు తీర్చే వరకు తాము ఎక్కడికి వెళ్ళమని ప్రాంగణంలోనే ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement