పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం | student suicide attempt in exam centre | Sakshi
Sakshi News home page

పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Mar 26 2015 1:01 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఓ విద్యార్థి ఎగ్జామ్‌హాల్‌లో ఆత్మహత్యకు యత్నించాడు.

విజయవాడ : ఓ విద్యార్థి ఎగ్జామ్‌హాల్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సు మొదటి ఏడాది చదువుతున్నాడు. అయితే గురువారం వార్షిక పరీక్షలుకు హాజరైన అనంతసాయి పరీక్షహాలులోనే పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన అధికారులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యాయత్యానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
(తిరువూరు)

Advertisement
 
Advertisement
Advertisement