ఆయా రాష్ట్రప్రభుత్వాలే విద్యార్థుల ఫీజుల చెల్లింపు | Student fees pay the state governments | Sakshi
Sakshi News home page

ఆయా రాష్ట్రప్రభుత్వాలే విద్యార్థుల ఫీజుల చెల్లింపు

Jun 16 2014 8:25 PM | Updated on Nov 9 2018 4:20 PM

ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే ఫీజులు చెల్లించాలని ఈ రోజు ఇక్కడ జరిగిన ఆఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్: ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే ఫీజులు చెల్లించాలని ఈ రోజు ఇక్కడ జరిగిన ఆఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చదివే తెలంగాణ విద్యార్థులకు తమ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపి విద్యార్థుల ఫీజును ఏపీ ప్రభుత్వమే భరించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు.

విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ పాత బకాయిలను కూడా ఆయా రాష్ట్రాలే భరించాలని తీర్మానించారు. 13 వందల కోట్ల రూపాయలు పాత బయాయిలు ఉన్నాయి. ఏ రాష్ట్రం వాటా ఎంత అనేది తేల్చి, తెలంగాణ వాటా తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు విద్యాసంస్థల విషయమై కొందరు కొన్ని సమస్యలు లేవనెత్తారు. ఆ విషయమై రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement