ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య | Student commits suicide | Sakshi
Sakshi News home page

ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

Nov 5 2015 6:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

వెలిగొండ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు  పాల్పడిన ఘటన వెలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి  చెందిన బాల వినోద్(24) ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement