హరికృష్ణ, అక్కినేని విగ్రహాల తొలగింపు | Statues Removed In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో అనుమతి లేని విగ్రహాల తొలగింపు

May 14 2019 9:27 AM | Updated on May 14 2019 9:32 AM

Statues Removed In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముందస్తు అనుమతిలేకుండా విశాఖలోని ఆర్కేబీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు విగ్రహాలను మున్సిపల్‌ అధికారులు సోమవారంఅర్థరాత్రి తొలగించారు. గతేడాది డిసెంబర్‌ మొదటి వారంలో మంత్రి గంట శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలను బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేశారు. అయితే జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రజాసంఘాలు కోర్డును ఆశ్రయించాయి. దీంతో కోర్డు ఆ విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్త్‌ మధ్య జీవీఎంసీ అధికారులు ఆ మూడు విగ్రహాలను తొలగించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement