Statues remove
-
హరికృష్ణ, అక్కినేని విగ్రహాల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: ముందస్తు అనుమతిలేకుండా విశాఖలోని ఆర్కేబీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు విగ్రహాలను మున్సిపల్ అధికారులు సోమవారంఅర్థరాత్రి తొలగించారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో మంత్రి గంట శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలను బీచ్ రోడ్డులో ఏర్పాటు చేశారు. అయితే జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రజాసంఘాలు కోర్డును ఆశ్రయించాయి. దీంతో కోర్డు ఆ విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్త్ మధ్య జీవీఎంసీ అధికారులు ఆ మూడు విగ్రహాలను తొలగించారు. -
విశాఖ బీచ్‌లో అనుమతి లేకుండా పెట్టిన విగ్రహాల తొలగింపు
-
రాజకీయ కక్షతోనే.. విగ్రహాల తొలగింపు!
-
విగ్రహాల తొలగింపులో రాజకీయ కక్ష: అంబటి
హైదరాబాద్: రాజకీయ కక్షతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దురద్దేశంతో వైఎస్ఆర్ విగ్రహాన్ని తాకితే ఏ శక్తి ఉందో తెలుస్తుందని చెప్పారు. ఎన్టీఆర్‌ను విగ్రహాంగా మార్చింది చంద్రబాబు కాదా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు కొన్ని ఛానల్స్‌లో వస్తున్న ప్రచారం అవాస్తవమని అంబటి ఖండించారు. కాగా, వైఎస్ఆర్సీపీ మానవతా దృక్పథంతోనే పోటీ చేయడం లేదని అంబటి స్పష్టం చేశారు.