స్టేట్ బ్యాంక్‌లో చోరీకి యత్నం | state bank robbery fail in kalyana durgam | Sakshi
Sakshi News home page

స్టేట్ బ్యాంక్‌లో చోరీకి యత్నం

Mar 9 2015 12:34 PM | Updated on Jun 1 2018 8:54 PM

స్టేట్ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు.

అనంతపురం : స్టేట్ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్ లోని అలారం మొగడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గోడ పెకిలించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూంను తెరవడానికి  ప్రయత్నించడంతో ఒక్కసారిగా అలారం మోగింది.

స్థానికులు ఎవరైన వస్తారేమోననే.. భయంతో దుండగులు పరారయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని మేనేజర్ రాంప్రసాద్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాధమిక దర్యాప్తు చేపడుతున్నారు.
(కళ్యాణదుర్గం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement