నీటి కోసం నిప్పులై..! | Srisailam forest area of Nallamala on Thursday rocked by anti-regime slogans. | Sakshi
Sakshi News home page

నీటి కోసం నిప్పులై..!

Aug 8 2014 12:17 AM | Updated on Sep 27 2018 5:46 PM

నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్‌పరిసర ప్రాంతాలు గురువారం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం నుంచి వచ్చేప్రణవ నాదాలకు రైతుల ఆర్తనాదాలు తోడయ్యాయి.

అసలే అంతంత మాత్రం వర్షాలు.. వచ్చిన కాస్తాకూస్తో నీటిని కూడా దిగువకు తీసుకెళ్తేతమ పరిస్థితి ఏమిటని అన్నదాత ఆవేదన.అయితే ప్రభుత్వం రైతుల వేదనను, వ్యథనుపట్టించుకోవడం లేదు. రాయలసీమ ప్రయోజనాలను కాలరాస్తూ శ్రీశైలం డ్యామ్‌లో కనీస నీటిమట్టాన్ని 788 అడుగులకు తగ్గించింది. సీమరైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగానిర్ణయం తీసుకున్నారు. అన్నదాతల మనోవేదనను అర్థం చేసుకొని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుఉద్యమబాట పట్టారు. నీటి కోసం నిప్పులై గురువారం శ్రీశైలం డ్యామ్‌ను ముట్టడించారు.సీఎం తీరు మారకపోతే మరో రాష్ట్ర ఉద్యమంతప్పదని హెచ్చరించారు. జీవో 69ని రద్దుచేయాలని, కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుకొనసాగించాలని డిమాండ్ చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్‌పరిసర ప్రాంతాలు గురువారం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం నుంచి వచ్చేప్రణవ నాదాలకు రైతుల ఆర్తనాదాలు తోడయ్యాయి.రాయలసీమ హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. కర్నూలు జిల్లా రైతులతోపాటువైఎస్సార్ కడప, అనంతపురం జిల్లా అన్నదాతలు ఈ ఆందోళనలో కదం తొక్కారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఏకపక్షవిధానాలను తూర్పారబట్టారు. రాయలసీమకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సైతంనిరసన గళాన్ని వినిపించారు.
 
 శ్రీశైలం డ్యామ్‌కనీస నీటిమట్టం విషయంలో ప్రభుత్వంస్పందించకపోతే ఉద్యమ బాట తప్పదనిహెచ్చరించారు. ైరైతు, ప్రజా సంఘాలనేతలు సైతం పిడికిలి బిగించారు. సీమరైతుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆందోళన పథాన్ని ఎంచుకున్నారు. గురువారంఉదయం 10 గంటలకు సున్నిపెంట గెస్ట్‌హౌస్ నుంచి పాదయాత్రగా డ్యాంకు చేరుకున్నారు. అక్కడ డ్యాం ఎస్‌ఈ కార్యాలయాన్నిముట్టడించారు. ఈ సందర్భంగా కర్నూలు,వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకుచెందిన ఎమ్మెల్యేలు తమ గళం వినిపించారు.రాయలసీమ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీరాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉండితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందులోఏమాత్రం తగ్గినా రాయలసీమ ఎడారిగామారక తప్పదని హెచ్చరించారు. సీమ ప్రజలహక్కు కోసం ముందుగా రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. రైతులు, ప్రజలుముందుకు వస్తే వారి కోసం పోరాడేందుకువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనినంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హామీఇచ్చారు. సీమ ప్రాంత ప్రజల కోసం దివంగతముఖ్యమంత్రి తలపెట్టిన సిద్దేశ్వర జలాశయాన్ని కూడా సాధించుకునేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గుండ్రేవులజలాశయం కూడా రాయలసీమ ప్రజలకుఎంతో అవసరమని సూచించారు.
 
  69 జీఓనువెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రినినిలదీయాలని రాయలసీమలోని అన్ని పార్టీలప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కృష్ణా బోర్డు కర్నూలులోనే ఏర్పాటు చేయాలి..సాగు, తాగు నీటి కోసం 65 గ్రామాలు, 6 లక్షలఎకరాలను వదులుకున్న కర్నూలు జిల్లాలోనేకృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ రైతుసంఘాల నేతలు డిమాండ్ చేశారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమప్రాంతంలో రైతుల కష్టాలను గట్టేక్కించాలంటేకర్నూలులోనే కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15న  కర్నూలుకు వస్తున్నసీఎం చంద్రబాబును ఈ విషయంపై  నిలదీస్తామని హెచ్చరించారు.  
 
 రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు సమన్యాయం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసీకెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీల తుంగభద్ర నీటిని అనంతపురం జిల్లాకు తరలించాలని, ప్రత్యామ్నాయంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం,పోలవరం, వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా, గుండ్రేవుల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి సత్వరమే ప్రాజెక్టు పనులనుచేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రాయలసీమ నీటి వాటా కోసం రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనివైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.
 
 ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుడ్డారాజశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, విశ్వేశ్వరరెడ్డి,చాంద్ బాష, జయరామ్, మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో పాటు బీజెపీ నేత నిమ్మకాయల సుధాకర్, రైతు సంఘం, రాయలసీమ ఐక్య కార్యాచరణసమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి,ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితి నాయకులుఎరువ రామచంద్రారెడ్డి, కుందూ పోరాటసమితి కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి, కేసీ కెనాల్‌సాధన కమిటీ అధ్యక్షుడు కట్టమంచి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని నీలంసాగర్ డ్యాంఎస్‌ఈ శ్రీనివాసరావుకు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement