breaking news
Booma Nagireddy
-
జోహార్ శోభమ్మ
జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.. ఘాట్ వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన ప్రతి హృదయం చలించింది. చేతులెత్తి మొక్కి.. జోహార్ శోభమ్మ అంటూ నినదించారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: శోభా నాగిరెడ్డి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రకటించారు. ట్రస్టుకు ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించానని, అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తానని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో శోభా ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్నా సరైన ప్లాట్‌ఫాం లేక ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వీరందరికీ ట్రస్టు ద్వారా సహాయం చేస్తామన్నారు. అదేవిధంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రతి యేటా ఆమె జయంతి, వర్ధంతి రోజున కల్యాణమస్తు పేరిట పేదలకు పెళ్లిళ్లు చేస్తామన్నారు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాల సాధనకు కృషి చేస్తామని వర్ధంతి సభకు తరలివచ్చిన అశేష జనవాహినికి హామీనిచ్చారు. తామంతా ఇంత ధైర్యంతో ముందుకు పోతున్నామంటే అది మీ అభిమానమేనని ప్రకటించారు. ‘ఆమె లేని లోటు నిజంగా మా కుటుంబానికి తీరనిలోటు. కేవలం భార్యగానే కాకుండా నాకు మంచి స్నేహితురాలిగా ఉంది. ఇటువంటి రోజు నా జీవితంలో ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు. ఆమె లేని జీవితం నాకు చాలా బాధాకరమైనది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అది కేవలం పిల్లల కోసమే’ అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ‘మాది పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరి కష్టసుఖాలు ఆమె తెలుసుకునేది. ఈ రోజు అందరం కలిసి ఉన్నామంటే అది శోభ ఘనతే’ అన్నారు. ఎక్కడ ఉన్నా నెంబర్ 1గా ఉండాలన్నదే ఆమె అభిమతమని, ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ నెంబర్ 1గా ఉండేందుకు కృషి చేసేదన్నారు. ఆ నాయకుడు నెంబర్ 1గా ఉండాలని కోరుకునే మంచి స్వభావం ఆమెదని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఇంత దగ్గర అవుతామని అనుకోలేదన్నారు. విజయమ్మ వెంట ఉండి ఆమెకు మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. ‘జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలని ఆమె భావించింది. ఆమె చివరిసారిగా మాట్లాడిన మాటలు కూడా అవే. బహుశా అది ఇప్పుడు కాదని భావించే ముందుగానే వెళ్లిపోయినట్టుంది’ అని బాధాతప్త హృదయంతో వ్యాఖ్యానించారు. ‘‘నంద్యాల బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లు.. సమయం అయిపోయింది అని అన్నాను. బహుశా మేమే ఆమెను పంపించామని తలచుకున్నప్పుడల్లా బాధ అవుతుంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గానికి మమ్మీ అయ్యింది నంద్యాల ఎంపీగా పీవీ నరసింహారావు మీద తాను పోటీ చేసినప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఆమెను మొదటిసారిగా పోటీలోకి దింపితే అందరూ డమ్మీ అభ్యర్థిని తెచ్చారని వ్యాఖ్యానించారని భూమా గుర్తుచేశారు. అయితే, ఆమె ఈ నియోజకవర్గానికి మమ్మీ అయిందన్నారు. ఆళ్లగడ్డ ఇంత ప్రశాంతంగా ఉందంటే గ్రూపులన్నీ ఏకం చేసిన ఘనత శోభమ్మదేనని వ్యాఖ్యానించారు. అమ్మ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా...! ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. తనకు ఎంతో ధైర్యం ఇచ్చిన మీకు రుణపడి ఉంటానని ప్రకటించారు. ‘తప్పకుండా అమ్మ కోరిక నెరవేరుతుందని, అమ్మ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. ఇంత మంది ఎంతో అభిమానంతో ఇక్కడకు వచ్చారని... ట్రాక్టర్ల మీద మహిళలు వచ్చారంటే అమ్మ మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. నంద్యాల సభ ముగిసిన తర్వాత చెల్లెలు ఆరోగ్యం బాగోలేదు చూసుకో.. నేను వస్తున్నా అని ఫోన్ చేసింది. అయితే, కొద్దిసేపట్లోనే మరణిస్తుందని ఊహించలేదని’ గద్గధ స్వరంతో వ్యాఖ్యానించారు. అమ్మ మరణించిన మూడు రోజులకే ప్రచారానికి వెళితే ఏమీ చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని.. ప్రజలే తనను ఓదార్చి, మేమున్నామని ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ‘చిన్నప్పుడు అమ్మ హాస్టల్ వద్దకు వస్తే గుర్తుపట్టలేదు. అప్పుడు అమ్మ ఎంతో బాధపడి ఇలాంటి పరిస్థితి రానివ్వనని మాట ఇచ్చింది. అయితే, ఎన్నికల సమయంలో అడిగితే ఒళ్లో తల పెట్టుకుని పడుకోబెట్టుకుని మాట్లాడింది. అయితే, ఈసారి తోడుగా ఉంటానని హామీ ఇవ్వలేదు. బహుశా అమ్మకు ముందే తెలిసీ హామీ ఇవ్వలేదోమో’ అని బాధాతప్త హృదయంతో అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తోబుట్టువు పుట్టినప్పుడు తనకు మాత్రమే తోబుట్టువుని, ఇప్పుడు రా్రష్ట ప్రజలందరికీ తోబుట్టువుగా నిలిచిందని కర్నూలు ఎమ్మెల్యే, శోభానాగిరెడ్డి అన్న ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నాన్నకంటే గొప్పనేతగా ఎదిగిందన్నారు. ఇంత మంది మనస్సుల్లో అభిమానం సంపాదించిన ఆమె తనకు చెల్లెలు కావడం గర్విస్తున్నానని ప్రకటించారు. ‘ఇప్పటికీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కలిసిన ప్రతిసారి శోభక్క ప్రస్తావన వస్తుంది. అనేక మంది నన్ను కర్నూలు ఎమ్మెల్యేగా కంటే శోభమ్మ అన్న అని పరిచయం చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంటోంది. పార్టీ నాయకురాలిగా, తల్లిగా, ప్రజా ప్రతినిధిగా సమన్వయంతో చక్కటి బాధ్యతలు నిర్వర్తించారు’ అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విజయమ్మ తర్వాత పేరు తెచ్చుకున్న వ్యక్తి శోభక్క అని చెప్పడంలో అతిశయోక్తి కాదని ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయమ్మ వెంట ఉండి నడిపించిందని, విజయమ్మకు సలహాలు, సూచనలు ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర రెడ్డి, గౌరు చరిత, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, విశ్వేశ్వర రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, చాంద్ బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కుటుంబ సభ్యులు భూమా నారాయణ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, బుడ్డా శేషారెడ్డి, చెరకులపాడు నారాయణ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, తెర్నేకల్లు సు రేందర్ రెడ్డి, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, డీకే రాజశేఖర్, యాలూరు కాంతారెడ్డి, వంగాల ఈశ్వర్ రెడ్డి, ఎస్వీ ప్రసాద్ రెడ్డి, కర్రా హర్షవర్దన్ రెడ్డి, భూమా నర్శిరెడ్డి, పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనం శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు రా ష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మరోవైపు పేదల కోసం మె గా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్య లో ప్రజలు తరలివచ్చి... ఆమె చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు శోభానాగిరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అదేవిధంగా శోభానాగిరెడ్డి గురించి రచించిన పాటల సీడీని జగన్ ఆవిష్కరించారు. సభలో ఆమెలేని జీవితం నరకప్రాయమని... కేవలం పిల్లల కోసమే బతుకుతున్నానని మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అమ్మను తలచుకుని భూమా అఖిలప్రియ మాట్లాడినప్పుడు ఆమెతో పాటు సభలో పలువురు కంటతడి పెట్టుకుని జోహార్ శోభమ్మ అని నినాదాలు చేశారు. ఇక శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్వీ మోహన్‌రెడ్డి తర్వాత ఏడేళ్లకు జన్మించిన సంతానం కావడంతో పువ్వుల్లో పెట్టి చూసుకున్నామన్నారు. ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని.. మాటలు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. పోటెత్తిన అభిమానులు ఆళ్లగడ్డ :శోభమ్మ సంస్మరణ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, మినీ బస్సులు, మోటారు సైకిళ్లలో ఉదయం 9 గంటల నుంచే జనం శోభా ఘాట్ చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సభా ప్రాంగణం చేరుకునే సరికి 20వేల కుర్చీలు జనంతో నిండిపోయాయి. జగన్ రాకతో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుర్చీలు సరిపడక ప్రజలు నిలబడే అభిమాన నేత ప్రసంగం ఆలకించారు. శోభానాగిరెడ్డి చిత్రపటాల పంపిణీ శోభానాగిరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా నంద్యాల నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ముద్రించిన 40వేల శోభానాగిరెడ్డి చిత్రపటాలను సంస్మరణసభలో పంపిణీ చేశారు. నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో శోభా నాగిరెడ్డి పేరు చెప్పినప్పుడల్లా ప్రజలు ఆమె చిత్రపటాన్ని చూపుతూ శోభమ్మ ఇంకా తమ మదిలోనే ఉందంటూ నినదించారు. శోభానాగిరెడ్డి సంస్మరణసభకు వచ్చిన అందరూ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో వచ్చి శోభమ్మకు నివాళులర్పించి సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు దారి కల్పించారు. అభిమానులందరికీ భోజన వసతి కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్ల సమన్వయంతో సంస్మరణ సభ ప్రశాంతంగా సాగింది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ల ద్వారా శోభా నాగిరెడ్డి జ్ఞాపకాలతో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేశారు. -
కనీస నీటిమట్టం కొనసాగించాలి
శ్రీశైలం డ్యామ్ ముట్టడిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల డిమాండ్ శ్రీశైలం: శ్రీశైలం జలాశయంలో 854 అడుగులు కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈమేరకు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు గురువారం శ్రీశైలం డ్యాంను ముట్టడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాయలసీమ రైతుల హక్కుల పరిరక్షణకు ప్రాణాలకైనా తెగించి పోరాడుతామని హెచ్చరించారు. రైతన్నల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్ర మంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), ఎస్వీ మోహన్‌రెడ్డి (కర్నూలు), గౌరు చరితారెడ్డి (పాణ్యం), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), ఐజయ్య (నందికొట్కూరు), మణిగాంధీ (కోడుమూరు), బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి (డోన్), చాంద్‌బాషా (క దిరి), విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ), మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, రైతు సంఘం నాయకులు దశరథరామిరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది రైతుల జీవన్మరణ సమస్య - వై. విశ్వేశ్వరరెడ్డి , ఎమ్మెల్యే, ఉరవకొండ అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో రాయలసీమకు ప్రాధాన్యమివ్వాలి. ఇక్కడ ఉన్న కాల్వలకు నీరు విడుదల చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ 800 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చునని చెప్పినా 400 టీఎంసీల నీటినే వినియోగించుకుంటూ మిగిలిన నీటిని కృష్ణా బ్యారేజ్ కింద వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు కట్టిన కొత్త ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ ఫలితమే. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఉత్పాదన పేరుతో డ్యామ్ కనీస నీటిమట్టాన్ని 788కి తగ్గించడం బాధాకరం. రైతులకు ఇది జీవన్మరణ సమస్య కావడంతో శ్రీశైలం ముట్టడి కార్యక్రమం చేపట్టాం. కనీస నీటి మట్టం పునరుద్ధరించే వరకు ఉద్యమం - చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని యథావిథిగా 854 అడుగులకు పునరుద్ధరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతోంది. మొన్నటి వరకు వివిధ పార్టీల వారంతా తాము రైతు పక్షాన నిలబడుతామని చెప్పిన వారే. ఈ రోజు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ముట్టడికి పిలిస్తే రాలేదు. అఖిలపక్షానికి చెందిన ఏ ప్రజాప్రతినిధి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులు మద్దతు తెలపకపోతే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బీడు భూమిగా మార్చేస్తుంది. ఇకనైనా సీమ రైతులు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా పోరాడాలి. రుణ మాఫీలో సీఎం విఫలం నందికొట్కూరు: ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శ్రీశైలం డ్యాం ముట్టడి కార్యక్రమానికి వెళ్తూ గురువారం ఆయన కర్నూలు జిల్లా నందికొట్కూరులో విలేకరులతో మాట్లాడుతూ రుణ మాఫీ చేయడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. -
నీటి కోసం నిప్పులై..!
అసలే అంతంత మాత్రం వర్షాలు.. వచ్చిన కాస్తాకూస్తో నీటిని కూడా దిగువకు తీసుకెళ్తేతమ పరిస్థితి ఏమిటని అన్నదాత ఆవేదన.అయితే ప్రభుత్వం రైతుల వేదనను, వ్యథనుపట్టించుకోవడం లేదు. రాయలసీమ ప్రయోజనాలను కాలరాస్తూ శ్రీశైలం డ్యామ్‌లో కనీస నీటిమట్టాన్ని 788 అడుగులకు తగ్గించింది. సీమరైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగానిర్ణయం తీసుకున్నారు. అన్నదాతల మనోవేదనను అర్థం చేసుకొని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుఉద్యమబాట పట్టారు. నీటి కోసం నిప్పులై గురువారం శ్రీశైలం డ్యామ్‌ను ముట్టడించారు.సీఎం తీరు మారకపోతే మరో రాష్ట్ర ఉద్యమంతప్పదని హెచ్చరించారు. జీవో 69ని రద్దుచేయాలని, కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుకొనసాగించాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్‌పరిసర ప్రాంతాలు గురువారం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం నుంచి వచ్చేప్రణవ నాదాలకు రైతుల ఆర్తనాదాలు తోడయ్యాయి.రాయలసీమ హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. కర్నూలు జిల్లా రైతులతోపాటువైఎస్సార్ కడప, అనంతపురం జిల్లా అన్నదాతలు ఈ ఆందోళనలో కదం తొక్కారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఏకపక్షవిధానాలను తూర్పారబట్టారు. రాయలసీమకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సైతంనిరసన గళాన్ని వినిపించారు. శ్రీశైలం డ్యామ్‌కనీస నీటిమట్టం విషయంలో ప్రభుత్వంస్పందించకపోతే ఉద్యమ బాట తప్పదనిహెచ్చరించారు. ైరైతు, ప్రజా సంఘాలనేతలు సైతం పిడికిలి బిగించారు. సీమరైతుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆందోళన పథాన్ని ఎంచుకున్నారు. గురువారంఉదయం 10 గంటలకు సున్నిపెంట గెస్ట్‌హౌస్ నుంచి పాదయాత్రగా డ్యాంకు చేరుకున్నారు. అక్కడ డ్యాం ఎస్ఈ కార్యాలయాన్నిముట్టడించారు. ఈ సందర్భంగా కర్నూలు,వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకుచెందిన ఎమ్మెల్యేలు తమ గళం వినిపించారు.రాయలసీమ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీరాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉండితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందులోఏమాత్రం తగ్గినా రాయలసీమ ఎడారిగామారక తప్పదని హెచ్చరించారు. సీమ ప్రజలహక్కు కోసం ముందుగా రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. రైతులు, ప్రజలుముందుకు వస్తే వారి కోసం పోరాడేందుకువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనినంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హామీఇచ్చారు. సీమ ప్రాంత ప్రజల కోసం దివంగతముఖ్యమంత్రి తలపెట్టిన సిద్దేశ్వర జలాశయాన్ని కూడా సాధించుకునేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గుండ్రేవులజలాశయం కూడా రాయలసీమ ప్రజలకుఎంతో అవసరమని సూచించారు. 69 జీఓనువెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రినినిలదీయాలని రాయలసీమలోని అన్ని పార్టీలప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కృష్ణా బోర్డు కర్నూలులోనే ఏర్పాటు చేయాలి..సాగు, తాగు నీటి కోసం 65 గ్రామాలు, 6 లక్షలఎకరాలను వదులుకున్న కర్నూలు జిల్లాలోనేకృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ రైతుసంఘాల నేతలు డిమాండ్ చేశారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమప్రాంతంలో రైతుల కష్టాలను గట్టేక్కించాలంటేకర్నూలులోనే కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15న కర్నూలుకు వస్తున్నసీఎం చంద్రబాబును ఈ విషయంపై నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు సమన్యాయం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసీకెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీల తుంగభద్ర నీటిని అనంతపురం జిల్లాకు తరలించాలని, ప్రత్యామ్నాయంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం,పోలవరం, వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా, గుండ్రేవుల ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు జరిపి సత్వరమే ప్రాజెక్టు పనులనుచేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రాయలసీమ నీటి వాటా కోసం రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనివైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుడ్డారాజశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, విశ్వేశ్వరరెడ్డి,చాంద్ బాష, జయరామ్, మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో పాటు బీజెపీ నేత నిమ్మకాయల సుధాకర్, రైతు సంఘం, రాయలసీమ ఐక్య కార్యాచరణసమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి,ఎస్ఆర్బీసీ పరిరక్షణ సమితి నాయకులుఎరువ రామచంద్రారెడ్డి, కుందూ పోరాటసమితి కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి, కేసీ కెనాల్‌సాధన కమిటీ అధ్యక్షుడు కట్టమంచి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని నీలంసాగర్ డ్యాంఎస్‌ఈ శ్రీనివాసరావుకు అందజేశారు. -
నంద్యాలలో గో సంరక్షణశాల
నంద్యాల, న్యూస్‌లైన్: పట్టణంలో నిరాధరణకు గురవుతున్న గోవులకు వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి ఆధ్వర్యంలో గో సంరక్షణశాల ఏర్పాటుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక సురక్షిత స్థలాన్ని ఎంపిక చేశారు. 15 రోజుల నుంచి పట్టణంలోని అపరిశుభ్రతకు కారణమైన అంశాలను ప్రజల నుంచి తెలుసుకొని వాటిని తొలగించే కార్యక్రమంలో భూమా నిమగ్నమయ్యారు. మొదటి దశలో పట్టణంలోని 50వేల కుటుంబాలకు మేలు చేకూర్చడానికి పందులను పట్టణ శివార్లకు తరలించే కార్యక్రమంలో విజయం సాధించిన భూమా రెండో విడతలో గోవుల తరలింపునకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఆయన నివాసంలో గోవుల ప్రేమికులను ఆహ్వానించి వారితో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డితో పాటు గో సంరక్షణ నాయకులు బసవరాజు, సుధాకర్, మాలేపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొని తమ సలహాలను అందజేశారు. రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గోవులను ఇప్పటికిప్పుడు ఇతర ప్రాంతాలకు తరలించడం సాధ్యం కాదని అందుకు ఎస్బీఐ కాలనీలోని తన సొంత స్థలం ఉందని ఏడాది కాలం తాత్కాలిక గోశాలను ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చని భూమాకు సూచించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ కాలనీకి వెళ్లి తాత్కాలికంగా ఏర్పాటు చేసే గో సంరక్షణ ఆశ్రమాన్ని భూమా సందర్శించారు. క్లీన్‌సిటీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని భూమా అన్నారు. పొక్లెయీన్లతో పదిహేను రోజుల నుంచి కంపచెట్లు ఉన్న స్థలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. -
రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబు: భూమా నాగిరెడ్డి
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అసలు చంద్రబాబు సమైక్యవాదా ... తెలంగాణ వాదా చెప్పాలని భూమా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వెనక్కి తీసుకోవాలన్నారు. అందుకోసం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు భూమా సూచించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి భూమా నాగిరెడ్డి హితవు పలికారు.