రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అసలు చంద్రబాబు సమైక్యవాదా ... తెలంగాణ వాదా చెప్పాలని భూమా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వెనక్కి తీసుకోవాలన్నారు. అందుకోసం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు భూమా సూచించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి భూమా నాగిరెడ్డి హితవు పలికారు.