తిరుపతి-కరకంబాడి రోడ్డులోని స్ప్రింగ్ డేల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించారు. ఐదు సంవత్సరాలుగా టెన్త్ ఫలితాల్లో...
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : తిరుపతి-కరకంబాడి రోడ్డులోని స్ప్రింగ్ డేల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించారు. ఐదు సంవత్సరాలుగా టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు వందశాతం ఉతీర్ణత సాధిస్తున్నారని ఆ పాఠశాల కరస్పాండెంట్ కేఎస్.శ్రీధర్, కార్యదర్శి కేఎస్.వాసు తెలిపారు. టెన్త్ పరీక్షలు 32 మంది విద్యార్థులు రాయగా అందరూ ఉతీర్ణత సాధించారన్నారు. ఏఎస్.క్రితిక్ 10పాయింట్లు సాధించాడని, 9.8 పాయింట్లు నలుగురు, 9.7 పాయింట్లు ఏడుగురు, ఎ1గ్రేడ్‌లు 20మంది విద్యార్థులు సాధించారని తెలిపారు.
శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హైస్కూల్‌లో...
పదవ తరగతి ఫలితాల్లో శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్‌లోని 16 మంది విద్యార్థులు 10 పాయింట్లు సా ధించారు. ఆర్. కేతన్, డి. సౌమ్యచౌదరి, పి. సంహిత్‌కుమార్, ఎం.యామిని, ఎం శాందిలయ్య, పి.శ్రీహిత్‌కుమార్, విష్ణుదత్త, ఎం.దొరబాబు, కె.సుకీర్త్, ఎంవీడీ.కార్తీక్‌రాజా, ఎస్.కమలేష్, కె.మనీషాప్రసాద్, ఎ.లిఖిత, సి.సేతురామ్, ఎం.చరిష్మ, టి.జాహ్నవిప్రియ 10కి 10పాయింట్లు సాధించారని కేఎస్. వాసు తెలిపారు.
తమ పాఠశాలలో 290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 289 మంది ఉతీర్ణత సాధించారని తె లిపారు. 9.8 పాయింట్లు 42 మంది, 9.7 పాయింట్లు 103 మంది, 9.5 పాయింట్లు 113 మంది సాధించారని తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, అధిక ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.