స్పైస్‌జెట్‌ కొత్త సర్వీస్‌కి శ్రీకారం | SpiceJet new service | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌ కొత్త సర్వీస్‌కి శ్రీకారం

Jun 17 2017 1:35 AM | Updated on Sep 5 2017 1:47 PM

గన్నవరం ఎయిర్‌పోర్టుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పైస్‌జెట్‌ సర్వీసులను విస్తరిస్తోంది.

విజయవాడ–హైదరాబాద్‌ మధ్య జూలై ఒకటి నుంచి ప్రారంభం
 
విమానాశ్రయం(గన్నవరం): గన్నవరం ఎయిర్‌పోర్టుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  స్పైస్‌జెట్‌ సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు రెండు, బెంగళూరు మూడు, చెన్నైకు ఒక సర్వీసును నడుపుతోంది. జూలై 1 నుంచి హైదరాబాద్‌కు అదనంగా మూడో  సర్వీసును ప్రారంభించనుంది.

78 సీట్ల సామర్థ్యం కలిగిన క్యూ–400 విమానం హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.05కు బయలుదేరి రెండు గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 2.40కి గన్నవరం నుంచి బయలుదేరి 3.30కి హైదరాబాద్‌ చేరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement