పాఠశాలకు ప్రేమతో..! 

Special Story About Ichapuram Government High School In Srikakulam - Sakshi

సాక్షి, ఇచ్ఛాపురం : విద్యాబుద్ధులు నేర్పిన గురువు, పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాటిని ఆచరణలోనికి తీసుకురాలేని పరిస్థితి. కొద్దిమంది మాత్రమే ఆచరణలోనికి తీసుకొచ్చి అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వారిలో ఇచ్ఛాపురం వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్వరరావు ఒకరు. ఈయనతో పాటు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడటం, సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందిపడటం చూసి చలించిపోయారు.

అదనపు గదులను నిర్మించాలని గతేడాది ఆగస్టులో సంకల్పించారు. అందుకు తగ్గట్టుగా అప్పటి కలెక్టర్‌ కె.ధనంజయ్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులను స్వయంగా కలిసి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందారు. ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలను 1903లో శ్రీసురంగి రాజావంశీలయులు నిర్మించారు. ప్రస్తుతం గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 1358 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెంకటేశ్వరరావు ఇదే పాఠశాలో 1985లో  విద్యాభ్యాసం ప్రారంభించారు. బడి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో కోటీ 50 లక్షల రూపాయంతో 10 అదనపు భవనాలు నిర్మించారు. ఈ నెల 28న రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top