‘పోలవరం’పై ప్రత్యేక దృష్టి | Special attention polavaram in Eluru | Sakshi
Sakshi News home page

‘పోలవరం’పై ప్రత్యేక దృష్టి

Jul 20 2014 2:21 AM | Updated on Aug 21 2018 8:34 PM

‘పోలవరం’పై ప్రత్యేక దృష్టి - Sakshi

‘పోలవరం’పై ప్రత్యేక దృష్టి

పోలవరం (ఇందిరాసాగర్) ప్రాజెక్టు నిర్మాణమే తన తొలి ప్రాధాన్యమని ప్రకటించిన జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.

 సాక్షి, ఏలూరు : పోలవరం (ఇందిరాసాగర్) ప్రాజెక్టు నిర్మాణమే తన తొలి ప్రాధాన్యమని ప్రకటించిన జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం,  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష జరిపా రు. ఐదేళ్ల్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, దానిని నెరవేర్చడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పోల వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనుల విషయంలో అవసరమైన నిర్ణయూలను వెంటవెంటనే తీసుకుంటామని, ఈ విషయంలో కిందిస్థాయి అధికారులు నేరుగా తన వద్దకు వచ్చి తక్షణ అనుమతులు పొందాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.
 
 నిర్వాసిత గ్రామాల ప్రజలకు మంజూరు చేసిన సహాయాన్ని అర్హులందరికీ అందించాలన్నారు. మొదటి దశలో చేపట్టిన 7 నిర్వాసిత గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ గృహ నిర్మాణాన్ని ఇంతవరకూ పూర్తి చేయకపోవడానికి కారణాలేమిటని ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. నిర్వాసితులలో అవగాహన కల్పించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం, రోడ్లు, డ్రెయినేజీ సౌకర్యం కల్పించడం వంటి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఐదు ఎకరాలకు ఒక బోరు చొప్పున మంజారు
 చేయాలని నిర్వాసితులు కోరుతున్నందునదీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. పొలవరం ప్రాజెక్టు కుడి కాలువకు అవసరమైన భూసేకరణలో తలెత్తిన సమస్యలను సంబంధిత యజమానులతో చర్చించి పరిష్కరించాలన్నారు.
 
 ఇకపై ప్రతి శనివారం సమీక్ష
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై ఇకనుంచి ప్రతి శనివారం అధికారులతో సమీక్ష జరుపుతామని కలెక్టర్ భాస్కర్ వెల్లడిం చారు. నెలలో మొదటి, మూడవ శనివారం భూసేకరణపై, రెండవ, నాలుగవ శనివారం నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి రావాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్‌వో కె.ప్రభాకరరావు, పోల వరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎల్.విజయసారధి, హెడ్ వర్క్స్ ఎస్‌ఈ కె.పోలేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ డి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement