సారీ.. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా: స్పీకర్‌ | Speaker Thammineni Seetharam Says Protesting Attitude Of TDP MLAs Walk Out | Sakshi
Sakshi News home page

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ మనస్తాపం

Jan 21 2020 11:48 AM | Updated on Jan 21 2020 2:08 PM

Speaker Thammineni Seetharam Says Protesting Attitude Of TDP MLAs Walk Out - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుతో శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ సభ్యుల వైఖరికి విసిగిపోయి.. సభను నడపలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం సైతం ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేయడంతో పాటు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్పీకర్‌ స్థానాన్ని అగౌరవపరిచారు. దీంతో వారికి సర్దిచెప్పేందుకు స్పీకర్‌ ప్రయత్నించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుల తీరుతో విసిగెత్తిపోయిన తమ్మినేని సీతారాం.. ‘‘ప్లీజ్‌... ఐ యామ్‌ సారీ.. ఐ యామ్‌ ప్రొటెస్టింగ్‌ ది ఆటిట్యూట్‌ ఆఫ్‌ టీడీపీ ఎమ్మెల్యేస్‌.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’’అంటూ సభ నుంచి వెళ్లిపోయారు.

‘రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడు’

సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం

సంక్షేమ పథకాలు వదిలేద్దామా! 

ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా?

ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?

Advertisement
 
Advertisement
Advertisement