ముగిసిన బీఏసీ సమావేశం.. నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు | AP Assembly Session 17th August Live News Updates And Top Headlines, YSRCP Demands CBI Probe Into AP DSC Irregularities | Sakshi
Sakshi News home page

ముగిసిన బీఏసీ సమావేశం.. నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు

Aug 17 2026 9:10 AM | Updated on Aug 17 2026 11:50 AM

AP Assembly Session 17th August Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

శాసనమండలి మీడియా పాయింట్..

  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..
  • నేడు ఏపీ చరిత్రలో చీకటి రోజు
  • నారా వారి స్కాంలో డీఎస్సీ స్కాం ఒకటి
  • డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వాయిదా తీర్మానం ఇచ్చాం
  • వెన్నుపోటు పార్టీ సభను వాయిదా వేయించింది
  • నారా లోకేష్ అసమర్ధుడు.. పనికిరాని వాడని వెన్నుపోటు పార్టీకి తెలిసిపోయింది
  • అందుకే డీఎస్సీపై చర్చ జరగకుండా అడ్డుకున్నారు
  • వైఎస్‌ జగన్‌ ఒకే ఒక్క సంతకంతో లక్షా25వేల సచివాలయం ఉద్యోగాలిచ్చారు.
  • పట్టుమని పదిహేను వేల ఉద్యోగాలను సక్రమంగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది.
  • సెప్టెంబర్ ఒకటి ప్రపంచ వెన్నుపోటు దినం
  • చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది సెప్టెంబర్ ఒకటినే.
  • ఆరోజు నుంచి నేటికీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు
  • డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో చర్చించేందుకు మేం సిద్ధం
  • మీరెందుకు భయపడుతున్నారు?
  • డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి

 

  • ముగిసిన బీఏసీ సమావేశం
  • నాలుగు రోజులు పాటు సమావేశాలు జరపాలని నిర్ణయం 

బీఏసీ సమావేశం..

  • స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం.
  • బీఏసీ భేటీకి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, విష్ణుకుమార్ రాజు, జీవీ ఆంజనేయులు
  • అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేయనున్న బీఏసీ

మంత్రుల అసహనం..

  • శాసనమండలి..
  • డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం
  • వైఎస్సార్‌సీపీపై, విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
  • బొత్స సత్యనారాయణను దద్దమ్మ అంటూ నోరుపారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
  • గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్‌సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు
  • అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం

 

  • డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన అసెంబ్లీ
  • శాసన మండలి వాయిదా.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన

  • డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ మండలిలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన
  • మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..
  • డీఎస్సీలో విచారణ జరిపించాల్సిందే
  • డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు
  • ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి
  • డీఎస్సీలో పారదర్శకత లేదు
  • అందుకే డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలి
  • మూడు లక్షల మంది అభ్యర్ధులను ఏ రకంగా మోసం చేశారన్న విషయంపై చర్చ జరగాలి
  • డీఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారు


ప్రారంభమైన శాసనమండలి సమావేశాలు

  • డీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
  • వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, రామ చంద్రారెడ్డి
  • వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
  • శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం
  • డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్‌సీపీ పట్టు
  • డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్సీలు నినాదాలు

ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి.
  • డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి.
  • విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే లోకేష్‌ రాజీనామా చేయాలి.
  • మీకు అనుకూలంగా జీవోలు మార్చుకుంటారా?
  • కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలి.
  • మంత్రి లోకేష్‌ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
  • ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి ఫస్ట్‌ ర్యాంక్‌ రావడమేంటి?. 

ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్‌..

  • మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
  • స్పోర్ట్స్‌ కోటా పేరుతో డీఎస్సీలో అక్రమాలు చేశారు.
  • మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే.
  • కేంద్రమంత్రి ధర్మేంద్ర​ ప్రధాన్‌ రాజీనామా చేసినట్టు లోకేష్‌ కూడా చేయాలి. 
     

👉ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ఏపీ డీఎస్సీ అక్రమాలపై పోరాటానికి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. అలాగే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

👉శాసన మండలిలో దీనిపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ సభ్యులు రెడీ అయ్యారు. ప్రదర్శనగా శాసనమండలిలోకి ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్సీ లు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, రామ చంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement