అమెరికాకు పయనమైన సోనియా | Sonia Gandhi to go abroad for health check-up | Sakshi
Sakshi News home page

అమెరికాకు పయనమైన సోనియా

Sep 3 2013 5:43 AM | Updated on Mar 18 2019 9:02 PM

అమెరికాకు పయనమైన సోనియా - Sakshi

అమెరికాకు పయనమైన సోనియా

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్య పరీక్షలకోసం అమెరికాకు పయనమయ్యారు. కుమార్తె ప్రియాంక వెంటరాగా సోనియా సోమవారం మధ్యాహ్నం అమెరికాకు బయల్దేరి వెళ్లారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్య పరీక్షలకోసం అమెరికాకు పయనమయ్యారు. కుమార్తె ప్రియాంక వెంటరాగా సోనియా సోమవారం మధ్యాహ్నం అమెరికాకు బయల్దేరి వెళ్లారు. ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది మాట్లాడుతూ.. ప్రతి ఆరునెలలకు ఒకసారి సోనియా సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా సోమవారం బయల్దేరి వెళ్లారని తెలిపారు.
 
 ఆమె చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో వైద్య పరీక్షలకోసం అమెరికా వెళ్లారు. అనంతరం ఈ ఏడాది ప్రథమార్థంలో వెళ్లాల్సి ఉండగా.. తీవ్రమైన పనుల ఒత్తిడి వల్ల జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమెరికా వెళ్లిన సోనియా ఏడెనిమిది రోజుల్లో దేశానికి తిరిగి వస్తారని తెలిపారు. 66 ఏళ్ల సోనియా 2011, ఆగస్టు 5న అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే జబ్బేమిటన్నది వెల్లడి కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement