సాక్షి విలేకరిపై మంత్రి సోమిరెడ్డి చిందులు

Somi Reddy Fires on the Sakshi journalist

సాక్షి, అమరావతి :  సాక్షి టీవీ ప్రతినిధి సతీష్‌పై మంత్రి సోమిరెడ్డి  చిందులు తొక్కారు. అన్ని ప్రశ్నలు మీరే ఎందుకు అడుగుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. వేరే విలేకరులు  కూడా ఉన్నారు కదా అంటూ చిర్రుబుర్రులాడారు. రైతు భరోసా కింద కేంద్రం ఇస్తున్న సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని కలిపి మొదటి విడతగా రూ. ఐదువేలు చెక్కు ఒక్కో రైతుకు ఇస్తున్నట్లు మంత్రి చెప్పగానే.. విలేకరి జోక్యం చేసుకుంటూ రబీ పూర్తయింది, ఖరీఫ్‌ పంట వేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుంది.

ఇప్పుడు ఎందుకు రైతులకు చెక్‌లు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి  సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేనెందుకు సమాధానం చెప్పాలంటూ వేరే అంశంపై మాట్లాడారు. ఈ ఘటన బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌ వద్ద మీడియాతో మంత్రి మాట్లాడుతున్నప్పుడు జరిగింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top