పాము ప్రత్యక్షం, భయంతో పరుగులు... | Snake given shock to woman devotees | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా పాము ప్రత్యక్షం, భయంతో పరుగులు...

Oct 23 2017 1:35 PM | Updated on Oct 23 2017 1:39 PM

Snake given shock to woman devotees

సాక్షి, కాకినాడ : నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్‌ తగిలింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు... పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement