
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పాము కలకలం రేపింది. ఆదివారం రాత్రి సమయంలో సచివాలయంలోని సౌత్ గేట్ నుంచి పాము లోపలికి వచ్చింది. మొదటి బ్లాక్ వైపు వస్తుండగా ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. పాము కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లకుండా చంపేశారు. దీంతో రాత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.