విద్యార్థుల ఉద్యమం.. ఎస్కేయూలో ఉద్రిక్తత | sku becomes tense after students agitation | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఉద్యమం.. ఎస్కేయూలో ఉద్రిక్తత

Apr 15 2015 12:44 PM | Updated on Nov 9 2018 4:59 PM

చంద్రబాబు సర్కారు తీరుపై విద్యార్థులు ఉద్యమించడంతో అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

చంద్రబాబు సర్కారు తీరుపై విద్యార్థులు ఉద్యమించడంతో అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతపురం - చెన్నై జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధించారు. స్వగ్రామానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడిని కూడా వాళ్లు అడ్డుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై పడుకోవడంతో వారిని అక్కడినుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, వాళ్లతో వాగ్వాదానికి దిగారు.

ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు కంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు. కేంద్రంతో వైరుధ్యం ఉన్నా కూడా ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అనుమతి ఇచ్చారని, కానీ ఇక్కడ మాత్రం  అలా చేయడం లేదని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement