ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

AP LAWCET 2020 Results Released At SK University - Sakshi

వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు

అనంతపురం: రాష్ట్రంలో న్యాయ విద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీలాసెట్‌–2020 ఫలితాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీలాసెట్‌ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్‌లో రెక్టార్‌ ప్రొఫెసర్‌ కృష్ణనాయక్, ఏపీలాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జ్యోతి విజయకుమార్‌లు గురువారం వెల్లడించారు. అక్టోబర్‌ 1న ఏపీ లాసెట్‌ ప్రవేశ పరీక్ష జరుగగా, కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన అభ్యర్థులకు అక్టోబర్‌ 31న ప్రత్యేకంగా ఏపీ లాసెట్‌ నిర్వహించారు. అక్టోబర్‌ 3న ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. ఇందులో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 3 మార్కులు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 1 మార్కు, రెండేళ్ల పీజీ లా కోర్సు ప్రవేశ పరీక్షకు 2 మార్కులు చొప్పున కలిపారు. మొత్తం 18,371 మంది దరఖాస్తు చేయగా, 12,284 మంది పరీక్ష రాశారు. వీరిలో 11,226 మంది (91.39%) అర్హత సాధించారు. అభ్యర్థులు htt p;//rche.ap.gov.in/LAWCET వెబ్‌సైట్లో తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షలో టాపర్స్‌..
1) టి.రవీంద్రబాబు (కృష్ణా జిల్లా), 2) కేశమ్‌ వేణు (ప్రకాశం), 3) అప్పానంద (తూర్పుగోదావరి), 4) పవన్‌కుమార్‌ (గుంటూరు), 5) జూటూరు దివ్యశ్రీ (అనంతపురం), 6) ఉప్పర సాగర్‌ (కర్నూలు), 7) పి.నరేంద్ర (కర్నూలు), 8) విజయలక్ష్మి.టి (కృష్ణా), 9) బల్లా ప్రసాదరావు (శ్రీకాకుళం), 10) విజయ్‌కిరణ్‌ (కృష్ణా)

ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షలో టాపర్స్‌..
1) ఆర్‌.నాగశ్రీ (తెలంగాణ), 2) వి.వీణ (చిత్తూరు), 3) కేజీ కార్తికేయ్‌ (నెల్లూరు) 4) రాజశ్రీరెడ్డి (తూర్పుగోదావరి) 5) చక్రధర్‌రెడ్డి (కర్నూలు) 
ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్ష టాపర్స్‌ వీరే..
1) డి.రవిచంద్ర (తూర్పుగోదావరి), 2) అహల్య చలసాని (కృష్ణా), 3) ఎం.హరికృష్ణ (శ్రీకాకుళం), 4) పి.రచన (చిత్తూరు) 5)యు.తోషిత (కృష్ణా) 

ఫలితాల కోసం చూడండి..
http://sakshieducation.com/

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top