న్యూస్‌లైన్: పట్టణంలోని ద్వారకానగర్ షిర్డీసాయి ఆలయంలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. కాపలాదారు అప్రమత్తంగా ఉండడంతో వారు పారిపోయారు.
షిర్డీసాయి ఆలయంలో చోరీ యత్నం
Sep 4 2013 5:41 AM | Updated on Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: పట్టణంలోని ద్వారకానగర్ షిర్డీసాయి ఆలయంలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. కాపలాదారు అప్రమత్తంగా ఉండడంతో వారు పారిపోయారు. సోమవారం రాత్రి కొందరు దుండగులు మత్స్యశాఖ కార్యాలయ సమీపంలో గల ద్వారకానగర్ షిర్డీ సాయి ఆలయం తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
దీనిని గమనించి కేకలు వేసిన కాపలాదారు మాధవయ్యపై రాయి విసిరారు. దీంతో మాధవయ్య మరింత బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే ఐదుగురు యువకులు పారిపోతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు స్థానికులు కూడా గాలించినా ఫలితం లేకపోయింది. ఆలయంలో ఏ విధమైన వస్తువులు పోకపోవడంతో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.
Advertisement
Advertisement