శంకర్ ‘ఐ’ విడుదల తేదీ ఖరారు | Shankar's 'I' release dates | Sakshi
Sakshi News home page

శంకర్ ‘ఐ’ విడుదల తేదీ ఖరారు

Dec 16 2014 6:43 AM | Updated on Jul 6 2018 3:32 PM

శంకర్ ‘ఐ’ విడుదల తేదీ ఖరారు - Sakshi

శంకర్ ‘ఐ’ విడుదల తేదీ ఖరారు

జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం.

శంకర్ ల భారీ చిత్రం 'ఐ' . ఈ చిత్రం రిలిజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి రాదంటూ వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీ ని ప్రకటించారు.

జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం. ఇప్పటికే మృగరాజు వేషంలో ఉన్న ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచుతోంది.

'ఐ'లో విక్రమ్‌ సరసన అమీ జాక్సన్‌ నటించింది. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకుడు. ప్రచార చిత్రంలో విక్రమ్‌ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు.

విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement