కార్మికుల పొట్టకొట్టిన అచ్చెన్నాయుడు

Shaik Mohammed Iqbal Comments On Atchannaidu Over ESI Scam - Sakshi

ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ 

సాక్షి, హిందూపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆస్పత్రులకు వైద్యపరికరాల కొనుగోళ్ల పేరుతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కార్మికుల పొట్టకొట్టాడని ఎమ్మెల్సీ షేక్‌మహమ్మద్‌ ఇక్బాల్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈఎస్‌ఐ పరికరాల కొనుగోలు స్కాంలో అచ్చెన్నాయుడు దోషి అని, ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్నారు. అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అచ్చెన్నాయుడు ఒకడు కావడం యాధృచ్ఛికమేనన్నారు. ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్‌ కంపెనీలకు కాంట్రాక్టులను అప్పగించి ఎక్కువ ధరలతో మెడికల్‌ కిట్లను కొనుగోలు చేసి దాదాపు రూ.300 కోట్ల స్కాం చేశారని ఆధారాలతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్‌  నిరూపించిందన్నారు. స్కాంలలో భాగస్వాములైన టీడీపీ నేతలు, మాజీ మంత్రులు స్టేలు తెచ్చుకోవడం మాని  ధైర్యముంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. టీడీపీ హయామంతా ప్రజల సొమ్మును దోచుకోవడం దాచుకోవడమే చేసిందన్నారు. రంజాన్‌ తోఫా, సంక్రాంతి కానుక, ఫైబర్‌ నెట్‌ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. వీటిన్నంటిపై సీబీఐ విచారణ చేయిస్తే అవినీతి బాగోతాలు బయటకొచ్చి అవినీతిపరులు శిక్ష అనుభవిస్తారని ఎమ్మెల్సీ చెప్పారు. 

చదవండి: ఈఎస్‌ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్‌’? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top