
బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురి అరెస్టు
హిందూపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు.
హిందూపురం(అనంతపురం): హిందూపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.81,325 నగదు, 7 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వరల్డ్ కప్ సందర్భంగా పట్టణంలో బెట్టింగ్‌లు జరగకుండా చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ సీఐ ఈదుర్ బాషా, టూటౌన్ సీఐ మధు తెలిపారు.