లక్ష ఆర్జిత సేవాటికెట్ల విడుదల | sevaonline tickets available, says ttd | Sakshi
Sakshi News home page

లక్ష ఆర్జిత సేవాటికెట్ల విడుదల

Jul 2 2016 3:35 AM | Updated on Sep 4 2017 3:54 AM

శ్రీవారి ఆర్జిత సేవల కు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మొత్తం 1,09,092 టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు.

అరగంటలోనే 25వేల టికెట్ల బుకింగ్
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవల కు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మొత్తం 1,09,092 టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. భక్తులు www.ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చన్నారు. ఇంతపెద్ద మొత్తంలో శ్రీవారి సేవా టికెట్లు విడుదల చేయటం ఇదే తొలిసారి.

సేవా టికెట్లు విడుదల చేసిన 30 నిమిషాల్లోనే 80వేల మంది భక్తులు 25వేల పైచిలుకు టికెట్లు రిజర్వు చేసుకున్నారన్నారు.  శ్రీవారి, పద్మావతి చిత్రాలతో కూడిన   రెం డు గ్రాముల బంగారు డాలర్లు శుక్రవారం నుండి అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో 15 రోజుల్లో తక్కువ ధరతో కూడిన రాగి డాలర్లు కూడా విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement