స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తుర్లపాటి | senior journalist turlapaty is brand ambassador for swachh andhra | Sakshi
Sakshi News home page

స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తుర్లపాటి

May 23 2017 8:58 PM | Updated on Sep 5 2017 11:49 AM

స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తుర్లపాటి

స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తుర్లపాటి

స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీనియర్‌ జర్నలిస్టు, కాలమిస్ట్‌ తుర్లపాటి కుటుంబరావు నియమితులయ్యారు.

విజయవాడ కల్చరల్‌: స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా విజయవాడకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు, కాలమిస్ట్‌ తుర్లపాటి కుటుంబరావు నియమితులయ్యారు. ఈ మేరకు స్వచ్ఛంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఎండీ బి.మురళీధరరెడ్డి నుంచి మంగళవారం లేఖ అందిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.

తుర్లపాటి 70 ఏళ్లుగా పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. అనేక పత్రికలకు వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా తెలుగు భాషాభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేశారు. తుర్లపాటిని స్వచ్ఛాంధ్ర మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంపై పలు కళా, సాంస్కృతిక సంస్థలు ఆయనకు అభినందనలు తెలియజేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement