సీఎం కిరణ్ తో సీమాంధ్ర నేతల భేటీ | seemandhra leaders meet kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ తో సీమాంధ్ర నేతల భేటీ

Jan 9 2014 7:32 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం సాయంత్ర సమావేశమైయ్యారు.

హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం సాయంత్ర సమావేశమైయ్యారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన పక్షంలో  సీమాంధ్ర నేతలు సీఎంతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి మంత్రులు వట్టి వసంత కుమార్, శైలజానాథ్, పితాని సత్యనారాయణ, మహీధర్ రెడ్డి, గంటా శ్రీనివాస్ లు హాజరవ్వగా, ఎమ్మెల్యేల్లో గాదె వెంకట రెడ్డి, ఈలి నాని, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, ద్రోణం రాజు శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లు హాజరైయ్యారు. రాష్ట్ర విభజన బిల్లులో సవరించాల్సిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనునన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement