విశాఖ జిల్లా సింహాచలం ఘాట్రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
విశాఖ : విశాఖ జిల్లా సింహాచలం ఘాట్రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవస్థానం బస్సు అదుపు తప్పి టోల్గేట్ వద్ద సెక్యూరిటీ గార్డును ఢీకొంది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సును ఓ ప్రయివేట్ వ్యక్తి నడిపినట్లు సమాచారం.
దీనిపై సింహాచలం ఈవో స్పందిస్తూ దేవస్థానం బస్సును ప్రయివేట్ వ్యక్తి నడిపినట్లు అంగీకరించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు దేవస్థానం ఉద్యోగి వెంకటేశంను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.