కాలువలో పడ్డ స్కూల్ బస్సు | school bus rolled in canal and seven injured | Sakshi
Sakshi News home page

కాలువలో పడ్డ స్కూల్ బస్సు

Feb 25 2015 8:18 PM | Updated on Sep 2 2017 9:54 PM

వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడింది.

తడ (నెల్లూరు): వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం ఎన్ఎమ్ కంద్రిగ (పెద్ద,చిన్న మాంబట్టు పంచాయతీ) వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొని బయలుదేరింది. డ్రైవర్ సింగిల్ రోడ్డులో వేగంగా బస్సును నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడింది.

దీంతో బస్సులో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. కాగా, ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పిల్లల్ని గ్రామస్తులు సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. పిల్లల గురించి విచారించాల్సిన నారాయణ స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement