గల్లా రామచంద్రనాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు | SC, ST Case Against Galla Ramachandra Naidu | Sakshi
Sakshi News home page

గల్లా రామచంద్రనాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు

Aug 10 2014 9:52 AM | Updated on Sep 15 2018 2:43 PM

గల్లా రామచంద్రనాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు - Sakshi

గల్లా రామచంద్రనాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు

అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడిపై రేణిగుంట పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

రేణిగుంట: అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడిపై రేణిగుంట పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన కేశవులు, పుదిపట్లకు చెందిన శ్రీరాములు శుక్రవారం కోడూరుకు వెళ్తుండగా కరకంబాడి రైల్వే గేటు వద్ద వీరికి ఎదురుగా వచ్చిన గల్లా రామచంద్రనాయుడు ‘‘సాధారణ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా.. మీ అంతుచూస్తాం’’ అంటూ తమను  కులం పేరుతో దూషించి, దాడికి యత్నించినట్లు కేశవులు, శ్రీరాములు రేణిగుంట డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఫిర్యాదుచేశారు.

ఆ సమయంలో డీఎస్పీ శ్రీనివాస్ లేకపోవడంతో ఆయన సీసీ ప్రసాద్ రాజు ఫిర్యాదును స్వీకరించారు. సాయంత్రం డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామచంద్రారెడ్డి క్రైమ్ నంబర్ 138-14 కింద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement