బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం | Samaikyandhra slogan at Children film festival closing ceremony | Sakshi
Sakshi News home page

బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం

Nov 20 2013 10:04 PM | Updated on Mar 22 2019 5:33 PM

బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం - Sakshi

బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం

18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో గవర్నరు నరసింహన్ ప్రసంగిస్తున్న సందర్భంగా సభలోని వీఐపీ గ్యాలరీలో కూర్చొన్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకుని గట్టిగా నినాదాలు చేశారు.

18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో గవర్నరు నరసింహన్ ప్రసంగిస్తున్న సందర్భంగా సభలోని వీఐపీ గ్యాలరీలో కూర్చొన్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకుని గట్టిగా నినాదాలు చేశారు. దీంతోస్వల్ప గందరగోళం ఏర్పడింది. సమైక్యాంధ్ర నినాదాలు చేసిన వ్యక్తిని  పోలీసులు పట్టుకుని లాక్కెళ్లారు. పోలీసులు లాక్కెళుతున్నా ఆ వ్యక్తి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్.. సేవ్ ఇండియా.. సేవ్ యునైట్ ఆంధ్రప్రదేశ్ ..’ అంటూ  బిగ్గరగా అరుస్తూ వెళ్లారు.  
 
హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement