పల్లె కన్నీరు పెడుతోంది

Sakshi Interview With Duvvada Srinivas

సాక్షి, టెక్కలి: ఏళ్లుగా ప్రజా పోరాటాలు చేసిన అనుభవం. జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేయడంతో జిల్లాపై సంపూర్ణ అవగాహన. జనం తరఫున మాట్లాడగలిగే దమ్ము.. వెరసి దువ్వాడ శ్రీనివాస్‌. వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ పల్లె కన్నీరు పెడుతోందని అంటున్నారు. ప్రచారమే తప్ప పనిచేయని అధికార పార్టీ తీరు వల్ల సి క్కోలు మరింత వెనుకబడిపోతోందని అంటున్నారు. ‘సాక్షి’తో తన మనోభావాలు ఇలా పంచుకున్నారు.

సాక్షి: తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. జిల్లా వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? 
దువ్వాడ : టీడీపీ పాలనలో జిల్లా మరింత వెనుకబడింది. గ్రామాల నుంచి యువత వలస పో తున్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో జనం తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పూ ర్తిస్థాయిలో భరోసా లేదు. మ త్స్యకారులు, జీడి, కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు. పేద, సామాన్య వర్గాలకు వి ద్య, వైద్యం అందడం లేదు.   

సాక్షి: గత ఎంపీ పనితీరు ఎలా ఉంది?
దువ్వాడ : జిల్లా ప్రజలు ఎంతో ఆశతో కె.రామ్మోహన్‌నాయుడిని గెలిపించారు. కానీ ఆయన మాటలు తప్ప పని చేయలేకపోయారు. మంత్రిని కూడా దగ్గర ఉం చుకుని జిల్లాకు నిధులు తెప్పించలే దు. ఐదేళ్ల కాలంలో జిల్లా కేంద్రంలో కోడి రామ్మూర్తి స్టేడియాన్ని కూడా ని ర్మించలేకపోయారు. నదుల అనుసంధానం చేయలేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఊసేలేదు. కిడ్నీ రోగులు, జీడి, కొబ్బరి రం గంపై ఆయన దృష్టి పెట్టిన దాఖలా ఒక్కటి కూడా లేదు. అభివృద్ధి చేయడంలో ఎంపీ దారుణంగా విఫలమయ్యారు.  

సాక్షి: వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థిగా జిల్లా సమస్యలపై ఎలాంటి అవగాహన ఉంది?
దువ్వాడ : గతంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అప్పటి నుంచి జిల్లాలో ప్రతి సమస్యపై అవగాహన ఉంది. అంతే కాకుండా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో గత కొన్నేళ్లుగా ప్రజా పోరాటాలు చేస్తున్నాను. ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆణిముత్యం లాంటి క్రీడాకారులు, మత్స్యకారులు, కిడ్నీ బాధితులు, జీడి, కొబ్బరి రైతులు, నిర్వాసితులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. 

సాక్షి: జిల్లాలో వైఎస్సార్‌ సీపీకి ఆదరణ ఎలా ఉంది?
దువ్వాడ : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అంతే కా కుండా మిగిలిన రాజకీయ నాయకుల మాదిరిగా కా కుండా నిజాయితీ రాజకీయాలతో కొత్త అధ్యయనా నికి శ్రీకారం చుట్టారు. అందు కే అంతా ఆయన నాయకత్వం కోరుకుంటున్నాను. రాష్ట్రానికి అలాంటి యువ నాయకత్వం కావా లి. 

సాక్షి: మీరు ఎంపీగా గెలిస్తే జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు?
దువ్వాడ : జిల్లా ప్రజల దీవెనతో ఎంపీగా గెలిస్తే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. వైఎస్సార్‌ ఆశయ సాధనలో భాగంగా జలయజ్ఞం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందజేస్తాను. కిడ్నీ రోగులకు ఆసరాగా డయాలసిస్‌ కేంద్రాలను విస్తరించేలా చేస్తాను. మత్స్యకారులకు, కూరగాయల రైతులకు అవసరమైన కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఉప్పు కార్మికులను ఆదుకోవడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. వంశధార నిర్వాసితులకు చట్టం ప్రకారం అందాల్సిన పూర్తి సదుపాయాలు కల్పిస్తాను. ప్రధానంగా వలసలు లేకుండా ఉపాధి మార్గాలు కల్పి స్తాను. జీడి, కొబ్బరి రైతులు, గిరిజనులను ఆదుకునే విధంగా ఆయా రంగాలను అభివృద్ధి చేస్తాను 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top