సకలం బంద్ | Sakalam bandh | Sakshi
Sakshi News home page

సకలం బంద్

Sep 8 2013 3:12 AM | Updated on Sep 3 2019 9:06 PM

తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓరుగల్లు సమరశంఖం పూరించింది. తెలంగాణవాదులు స్వచ్ఛంద బంద్‌తో తమ గుండెల్లో గూడుకట్టుకున్న ఆకాం క్షను మరోసారి చాటిచెప్పారు.

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓరుగల్లు సమరశంఖం పూరించింది. తెలంగాణవాదులు స్వచ్ఛంద బంద్‌తో తమ గుండెల్లో గూడుకట్టుకున్న ఆకాం క్షను మరోసారి చాటిచెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని తేల్చిచెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ విజయవంతమైంది.

తెలంగాణవాదుల ప్రచారం, పలు సం ఘాల పిలుపునకు స్పందించిన వివిధ వర్గాలు బంద్‌కు పూర్తిగా సహకరిం చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, బ్యాంకులు, పెట్రోల్ పంపులు, థియేటర్లు తెరుచుకోలేదు. వరంగల్ వ్యవసాయ, కూరగాయల  మార్కెట్లలో లావాదేవీలు నిలిచిపోయాయి. నిరసనకారులతో జిల్లా, మండల కేంద్రాలతోపాటు, ప్రధాన సెంటర్లు తెలం‘గానం’తో మార్మోగాయి.
 
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. ప్రయూణికులతో ఎప్పుడూ కిటకిటలాడే బస్‌స్టేషన్లు బోసిపోయాయి. బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన టీఎంయూ, ఎంప్లాయూస్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. హన్మకొండ, నర్సంపేట, పరకాల, తొర్రూరు డిపోల వద్ద రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ర్యాలీలు చేపట్టారు.

హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట, ములుగులో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జనగాం, నర్సంపేట, పరకాల, ములుగు, హన్మకొండ, వరంగల్, వర్ధన్నపేట, తొర్రూరు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, టీఆర్‌ఎల్‌డీ, న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాలు, జేఏసీలు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు, టీఎన్‌ఎస్, తెలంగాణవాదులు ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నెక్కొండ వుండలంలోని పెద్ద కొర్పోలు సమీపంలో రైల్వేలేన్‌కు సంబంధించిన ఫిష్‌ప్లేట్లను గుర్తుతెలియని వ్యక్తులు  తొలగించారు.  రైల్వే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.

భూపాలపల్లిలో తెరిచి ఉన్న రావు చిట్‌ఫండ్ కార్యాలయం అద్దాలను తెలంగాణవాదులు పగులగొట్టారు. కాగా, బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. వరంగల్, కాజీపేటతోపాటు ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ జేఏసీ  జిల్లా చైర్మన్ పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, మొలుగూరి బిక్షపతి, డాక్టర్ రాజయ్య, టీఆర్‌ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, చింతాకుల సునీల్, సీపీఐ నాయకులు సదానందం, న్యూడెమోక్రసీ నాయకులు దయాకర్, అప్పారావు, ఉద్యోగ సంఘాల నాయకులు పరిటాల సుబ్బారావు, రాజేష్‌గౌడ్, రత్నవీరాచారి, న్యాయవాద సంఘాల నాయకులు అంబరీష్, గుడిమల్ల రవికుమార్ పాల్గొన్నారు.
 
 నగరంలో నిరసనల వెల్లువ

 జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, విద్యాశాఖ, జెడ్పీ, మెడికల్, ఇతర విభాగాలకు చెందిన  ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అమరవీరుల స్థూపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ బైఠాయించి నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఎంజీఎంలో మెడికల్ జేఏసీ ధర్నా నిర్వహిం చింది. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. హన్మకొండలో టీఆర్‌ఎస్, వరంగల్‌లో తూర్పు జేఏసీ, టీఆర్‌ఎస్, టీఎన్‌ఎస్, సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.

వరంగల్ సెంట్రల్ జైలులో నక్సల్స్ ఖైదీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులపై దాడులకు నిరసనగా అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కేయూలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులపై దాడులకు నిరసనగా కేయూ జేఏసీ, టీజీవీపీ, టీఆర్‌ఎస్వీ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో హన్మకొండ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ఆటోయూని యన్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, మార్కెట్ ఉద్యోగులు, గుమస్తాలు తదితరులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement