
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు గాను 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పునరుద్ధాటించారు. బీసీ సామాజిక న్యాయ వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే అది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.
ఈరోజు(శనివారం, అక్టోబర్ 18వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నిర్వహించిన బంద్‌లో వివేక్ పాల్గొన్నారు. చెన్నూర్, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర బంద్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ మేరకు వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పరుత్వం అనేది బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో సైతం బీసీ అనుకూల విధానాలను రాష్ట్ర ప్రభుతం అమలు చేస్తూనే ఉంటుందని, చట్టపరమైన, రాజకీయ పరమైన సవాళ్లకు భయపడకుండా తమ పొరాటాన్ని సాగిస్తూనే ఉంటుందన్నారు. .