సూక్ష్మ ప్రణాళిక ద్వారా గ్రామాల అభివృద్ధి | Rural development through micro-planning | Sakshi
Sakshi News home page

సూక్ష్మ ప్రణాళిక ద్వారా గ్రామాల అభివృద్ధి

Nov 7 2014 1:58 AM | Updated on Jul 28 2018 6:33 PM

జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సూక్ష్మ ప్రణాళిక ద్వారా సేకరిస్తున్న సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరిస్తామని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖా మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు.

జన్మభూమి సభలో మంత్రి అయ్యన్న

కె.కోటపాడు: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సూక్ష్మ ప్రణాళిక ద్వారా సేకరిస్తున్న సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరిస్తామని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖా మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలోని రొంగలినాయుడుపాలెంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడారు. ఫించన్లను ఐదురెట్లకు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లకు మరింత భరోసా కల్పించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 45లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని, అర్హులుంటే వారికి కూడా అందేలా సీఎం ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

రేషన్ కార్డుల్లో వయస్సు తక్కువగా ఉండి పింఛన్ కోల్పోతే సమీపంలోని పీహెచ్‌సీలలో వైద్యాధికారి ద్వారా వయస్సు నిర్థారణ పత్రాన్ని తీసుకువస్తే పింఛన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వికలాంగుల సౌకర్యార్థం ఈ నెలాఖరులోగా ప్రతి మండల కేంద్రంలో సదరన్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. గొండుపాలెం-రొంగలినాయుడుపాలెం గ్రామాల మధ్యగల మొండిగెడ్డపై వంతె న నిర్మాణానికి రూ. కోటి 20లక్షల నిధులను మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించండి
జన్మభూమి సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కోరారు. గిరిజన, మైదాన గ్రామాల్లో మంచినీటి పథకాలు నేటికీ నిర్మాణానికి నోచుకోలేదన్నారు. కె.కోటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఈ సభలో చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, జెడ్పీసీఈవో మహేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ భవానీ, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనువాస్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి, ఎంపీపీలు సబ్బవరపు పుష్పావతి, కిలపర్తి భాస్కరరావు, సర్పంచ్ రొంగలి సత్యవతి, పీఏసీఎస్ అధ్యక్షుడు జూరెడ్డి రాము తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement