మృణాళిని ఆకస్మిక తనిఖీలు | Rural development Minister inspection in local constituency | Sakshi
Sakshi News home page

మృణాళిని ఆకస్మిక తనిఖీలు

Jan 27 2015 11:24 AM | Updated on Sep 2 2017 8:21 PM

విజయనగరం జిల్లా చీపురపల్లిలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని మంగళవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విజయనగరం: విజయనగరం జిల్లా చీపురపల్లిలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా స్థానిక బాలుర పాఠశాలను ఆమె సందర్శించారు.  విధులు సక్రమంగా నిర్వహించని ఉపాధ్యాయులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 14 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయాలని మృణాళిని ఉన్నతాధికారులను ఆదేశించారు. పాఠశాలలో సౌకర్యాలపై ఆమె ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సౌకర్యాలను మెరుగుపరచాలని మృణాళిని ఆధికారులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement