ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపు! | rtc regional manager respond on Madakasira bus accident | Sakshi
Sakshi News home page

ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపు!

Jan 7 2015 1:22 PM | Updated on Sep 2 2017 7:21 PM

ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపు!

ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపు!

అనంతపురం జిల్లా మడకశిర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ఆర్టీసి రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సందేహం వెళ్లిబుచ్చారు.

అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ఆర్టీసి రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సందేహం వెళ్లిబుచ్చారు. అసలు రోడ్డుకు ఎడమ వైపుకు వెళ్లాల్సిన బస్సు, కుడి వైపుకు ఎందుకు వెళ్లిందో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.   

రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి  స్తంభాలు కూడా లేవన్నారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. కాగా తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో మృతుల సంఖ్య 16కి చేరింది. మరోవైపు ఓవర్ లోడ్ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement